క్వశ్చన్ పేపర్ లీకేజీతో
నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయిన నేపథ్యంలో అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రీఫండ్ చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫీజు రిఫండ్ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఫీజు వాపసు కోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడానికి రేపు (జులై 7) రాత్రి 11:50 గంటలను తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు తమ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్‌టీఏ హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in.