పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మారిన UAN రూల్స్

10170చూసినవారు
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మారిన UAN రూల్స్
EPFO తన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అనంతరం పునరుద్ధరించింది. ఈ కొత్త మార్పుల్లో భాగంగా, నేరుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా యూఏఎన్ (UAN) యాక్టివేషన్, కొత్త యూఏఎన్ జనరేషన్ సదుపాయాలను నిలిపివేసి, ఈ సేవలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ఉమాంగ్' యాప్‌కు బదిలీ చేసింది. దీనికోసం ఆధార్ ఆధారిత 'ఫేస్ అథెంటికేషన్' తప్పనిసరి చేశారు. ఆన్‌లైన్ సేవలను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. అయితే కొత్త సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా, మొదటి రెండు వారాల పాటు ఆన్‌లైన్ క్లెయిమ్‌ల పరిశీలనకు కొంత ఎక్కువ సమయం పట్టవచ్చని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్