ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.