ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

30చూసినవారు
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వేడిగాలులతో ప్రజలు అల్లాడుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు, పిడుగులు వణికిస్తున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్