అలర్ట్.. 24 గంటల్లో భారీ వర్షాలు

16306చూసినవారు
AP: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. మరో రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడనుందని వెల్లడించారు. 24 గంటల్లో ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్