ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

0చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శనివారం అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్