AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఆదివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించింది.