అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

0చూసినవారు
అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: మురసు తుఫాన్ ప్రభావంతో గురువారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్