AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. గురువారం శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, ఉ.గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏలూరు, కృష్ణా,
ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్సుందని పేర్కొంది. వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించింది.