AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీరం వెంబడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు వంటి అవసరమైన వస్తువులను సమకూర్చాలని, రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.