AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని APSDMA తెలిపింది. ద్రోణి ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ఏలూరు, పోలవరం,
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 43°C - 45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.