ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

33చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు వరద ప్రవాహం 8-9 లక్షలకు చేరే అవకాశం ఉంది. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేేలు దాటవద్దని, నదులలో చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్