అలర్ట్: ఇవాళ ఏపీలో తీవ్ర వడగాలులు

29చూసినవారు
అలర్ట్: ఇవాళ ఏపీలో తీవ్ర వడగాలులు
AP: నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కడప జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.7 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని తెలిపింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలపై కూడా ప్రభావం ఉంటుందంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్