AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. సోమవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.