ALERT: నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

89చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.