ALERT: ఇవాళ రాత్రి పిడుగులతో వర్షాలు

25చూసినవారు
ALERT: ఇవాళ రాత్రి పిడుగులతో వర్షాలు
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ మేరకు రాయలసీమ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్