రైతులకు అలర్ట్.. ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేయించుకోండి

57చూసినవారు
రైతులకు అలర్ట్.. ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేయించుకోండి
AP: రైతుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రాయితీపై పరికరాలు, డ్రోన్లు, గోకులాలు, సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. కేంద్ర సహకారంతో కూడా కొన్ని పథకాలు అమలవుతున్నాయి. అయితే ఈ పథకాలు రైతులకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు చేసుకోవాలని సూచించింది. 11 అంకెల యూనిక్ ఐడీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.