చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారని మాజీ సీఎం,
వైసీపీ అధినేత
జగన్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం పొగాకు రైతులతో
జగన్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రభుత్వంలో పొగాకు ధర కిలో రూ.289 ఉండగా, ప్రస్తుతం రూ.236 మాత్రమే లభిస్తోందని, పెట్టుబడులు పెరిగి రాబడి తగ్గడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో
వైసీపీ అధికారంలోకి వస్తే నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని
జగన్ హామీ ఇచ్చారు.