AP: నేటి నుంచి టెట్
పరీక్షలు నేపథ్యంలో అభ్యర్థులకు మంత్రి
లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ మేరకు మరో డీఎస్సీని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. కాగా అక్టోబర్‌లో
నోటిఫికేషన్ వెలువడనుంది, డిసెంబర్‌లో
పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే 6,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ-2025 పూర్తయిన విషయం తెలిసిందే.