తెలుగు చిత్రసీమలో నటులు అల్లరి నరేష్, నారా రోహిత్ త్వరలో కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ‘సుందరకాండ’ చిత్ర దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని హరీష్ పెద్ది సొంత బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశ ముగిసి, ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నెలలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.