నంద్యాల జిల్లాలో మామ, కోడళ్ల మధ్య తీవ్ర రాజకీయ వేడి రాజుకుంది. మాజీ మంత్రి, విజయ మిల్లు డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డిపై, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. పాల పొడి ప్లాంట్ ను ఉపయోగించకుండా కర్ణాటకకు పాలు పంపడం, డీజిల్ కొనుగోళ్లలో అవినీతి వంటి ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఎస్వీ జగన్ ఖండించారు. 2018 నుంచే ప్లాంట్ పనిచేయడం లేదని, డీజిల్ కొనుగోళ్లలో తన ప్రమేయం లేదని, అఖిలప్రియ తన సొంత ఎజెండాతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అఖిలప్రియకు జగన్ సవాల్ విసిరారు.