మున్సిపాలిటీల్లో కూటమి జోరు.. 60 స్థానాల్లో విజయం

37చూసినవారు
మున్సిపాలిటీల్లో కూటమి జోరు.. 60 స్థానాల్లో విజయం
AP: మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మొత్తం 87 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగగా.. కూటమి అభ్యర్థులు 60 స్థానాల్లో విజయం సాధించారు. మరో 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ 43 స్థానాల్లో గెలవగా.. 16 చోట్ల లీడ్‌లో ఉంది. జనసేన 14 స్థానాల్లో విజయం సాధించగా.. 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందగా.. ఒక చోట లీడ్‌లో ఉంది. వైసీపీ ఒక చోట విజయం సాధించగా.. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్