AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి శనివారం నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్ కింద పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, గడువులోగా తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు.