టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతుల 52వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న అల్లు శిరీష్, నయనిక రెడ్డి జంట ఈ వేడుకలను దగ్గరుండి నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్, నిర్మల, పెద్ద కొడుకు అల్లు బాబీ, కోడలు నీలు షా, రెండో కొడుకు అల్లు అర్జున్, కోడలు స్నేహారెడ్డి, మూడో కొడుకు అల్లు శిరీష్, కోడలు నయనిక రెడ్డి అందరూ కలిసి ఫోటోలు దిగారు. ఈ కుటుంబ ఫోటోలు, వేడుకల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.