అల్లు అర్జున్ AA22: పుట్టినరోజున టైటిల్ పోస్టర్ మాత్రమే!

17481చూసినవారు
అల్లు అర్జున్ AA22: పుట్టినరోజున టైటిల్ పోస్టర్ మాత్రమే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం AA22 (వర్కింగ్ టైటిల్) గురించి స్పష్టత వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ వీడియో వస్తుందని వార్తలు వస్తున్నా, అలాంటిదేమీ లేదని, కేవలం టైటిల్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయనున్నారని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ వార్తతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్