అల్లు అర్జున్-అట్లీ సినిమా షూటింగ్ వాయిదా

12194చూసినవారు
అల్లు అర్జున్-అట్లీ సినిమా షూటింగ్ వాయిదా
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం పడింది. దుబాయ్‌లో ప్లాన్ చేసిన తదుపరి షెడ్యూల్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా భద్రతా సమస్యలు, విమాన సర్వీసుల అంతరాయం వంటి పరిణామాలతో తాత్కాలికంగా రద్దు చేశారు. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూడాలా, కొత్త లొకేషన్ ఎంపిక చేయాలా అనే దానిపై మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా వెలువడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్