అల్లు అర్జున్ బర్త్‌డే రోజున కొత్త సినిమా టైటిల్, పోస్టర్ ప్రకటన!

13414చూసినవారు
అల్లు అర్జున్ బర్త్‌డే రోజున కొత్త సినిమా టైటిల్, పోస్టర్ ప్రకటన!
అల్లు అర్జున్ అభిమానులకు నిర్మాత బన్నీ వాసు శుభవార్త తెలిపారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్న సినిమా టైటిల్‌ను ఏప్రిల్ 8న, ఆయన పుట్టినరోజున ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'AA 22' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణెతో పాటు జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై బన్నీ పుట్టినరోజున స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్