ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం (ఏప్రిల్ 8) విడుదలైంది. పోస్టర్‌లో అల్లు అర్జున్ గుండుతో, తోడేలు కాళ్లలాంటి చేతులతో భయంకరమైన అవతార్‌లో కనిపించారు. అయితే, ఈ లుక్ 2016లో వచ్చిన కార్తీ 'కాష్మోరా'లోని రాజ్‌నాయక్ పాత్రను పోలి ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సుమారు ₹800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.