
మాపై ఎవరి ఒత్తిళ్లూ లేవు: LIC క్లారిటీ
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులపై జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) స్పష్టత ఇచ్చింది. పెట్టుబడుల నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటామని, ప్రభుత్వ జోక్యం లేదని తెలిపింది. ప్రభుత్వ ఒత్తిడితో LIC అదానీలో పెట్టుబడి పెడుతుందంటూ వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు నిరాధారమని ఖండించింది. అన్ని పెట్టుబడులు బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటామని పేర్కొంది.




