అనకాపల్లి జిల్లా, బుచ్చయ్యపేట మండలం, పొట్టిదోరపాలెం గ్రామంలో గురువారం వి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అనేది మన హక్కు మరియు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అని పేర్కొన్నారు. డబ్బుకు ఓటును అమ్ముకోకుండా, అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని, సేవాభావం పరిశీలించి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.