అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని బంగారుపాలెం గ్రామానికి చెందిన పేర్ల సోమేష్ (53) అనే మత్స్యకారుడు బుధవారం సముద్రంలో వేటకు వెళ్లి వల వేసి, మధ్యాహ్నం వల తీసే క్రమంలో జారిపడి వలలో చిక్కుకుపోయాడు. ఉప్పు నీరు తాగడంతో కొన ఊపిరితో ఉన్న అతన్ని ఒడ్డుకు చేర్చి వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.