బుచ్చయ్యపేట మండలంలోని 19 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బుధవారం
బీజేపీ జనరల్ సెక్రటరీ గొలగాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి గేదెల సత్యనారాయణ, జడ్పీటీసీ అభ్యర్థి పోతల భవాని రమేష్‌లను భారీ మెజార్టీతో గెలిపించి జిల్లాకే ఆదర్శంగా నిలపాలని ఆయన కోరారు. ఎంపీ సీఎం రమేష్, కేఎస్ఎన్ఎస్ రాజు, పీవీఎస్ఎన్ రాజుల ఆశీస్సులు కూటమి అభ్యర్థులకు మెండుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.