అనకాపల్లి జిల్లా కసింకోట మండలం అమీన్ సాహెబుపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శివప్రసాద్, అంగన్వాడీ టీచర్ పి. సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు మరియు తల్లులు పాల్గొన్నారు.