ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు.. అప్రమత్తమైన ఎస్‌ఎస్‌టీ బృందం

0చూసినవారు
ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు.. అప్రమత్తమైన ఎస్‌ఎస్‌టీ బృందం
ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించే ఇతర వస్తువుల తరలింపును అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ప్రధాన రహదారిపై ఎస్‌ఎస్‌టీ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌) బృందం వాహన తనిఖీలు నిర్వహించింది. ప్రధాన రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నగదు లేదా ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచుతున్నామని ఎస్ ఎస్ టి బృందం ఎంఈఓ రామారావు తెలిపారు. ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్