Oct 03, 2025, 12:10 IST/
మ్యాన్ హోల్లో పడి వ్యక్తి మృతి
Oct 03, 2025, 12:10 IST
TG: వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వాటర్ ఆపరేటింగ్ మ్యాన్ హోల్లో పడి మంగలి మానయ్య(50) అనే వ్యక్తి మృతి చెందాడు. మానయ్య పాత తాండూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.