అరకులోయ మండలంలోని లోతేరు పంచాయతీ పొలిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు 8 మేకలు మృతి చెందాయి. బట్నాయక్ భాస్కర్‌కు 3, బట్నాయక్ శ్రీరాములకు 2, కేరంగి చంపకు 3 మేకలు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని, వారికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.