అరకు ఐటీఐ జంక్షన్‌లో 80 కిలోల గంజాయి స్వాధీనం

946చూసినవారు
అరకు ఐటీఐ జంక్షన్‌లో 80 కిలోల గంజాయి స్వాధీనం
అరకులోయ మండలంలో ఆదివారం 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీఐ జంక్షన్‌ వద్ద వాహన తనిఖీల్లో ఒడిశా నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న నలుగురిని గుర్తించారు. పోలీసులను చూసి ఇద్దరు పరారవగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు మూటల్లో 80 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ. 2,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్