అల్లూరి: అన్నం బాలేదని అడిగినందుకు విద్యార్థులను చితకబాదిన HM

295చూసినవారు
భోజనం సరిగా లేదని అడిగినందుకు ఆ విద్యార్థులనే HM చితకబాదిన సంఘటన అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండలో చోటుచేసుకుంది. దారకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో గురువారం విద్యార్థులకు వడ్డించిన ఆహారం బాలేదని HMను ఇద్దరు విద్యార్థులు అడగ్గా వారిని కొట్టినట్లు ఆ పాఠశాల కమిటీ ఛైర్మన్ మణి తెలిపారు. గాయాలైన విద్యార్థులు దారకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్