అనంతగిరి మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కడరేవు, ఎర్రగొప్పు గ్రామాల్లో రహదారి నిర్మాణం మూడేళ్లుగా పూర్తికాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షానికి మట్టిరోడ్డు బురదమయంగా మారడంతో, బైకులను ఎత్తుకొని తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.