గిరిజన మహిళపై దాడి.. బంగారం దోపిడీ

1335చూసినవారు
గిరిజన మహిళపై దాడి.. బంగారం దోపిడీ
అరకులోయ మండలంలో గిరిజన మహిళపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం. కొత్తవలస పంచాయతీ పప్పుడువలస సమీపంలో ఆదివారం పొలం పనులు చేస్తున్న జన్ని కరిమ (55) వద్దకు ఓ అపరిచిత వ్యక్తి వచ్చి కత్తితో బెదిరించాడు. అనంతరం ఆమెపై దాడి చేసి చెవి దిద్దులు, కమ్ములను లాక్కొని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కరిమను స్థానికులు అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్