కరకవలస రహదారిలో ఆటో బోల్తా

1304చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ చిడివలస గ్రామం వద్ద కరకవలస రహదారిలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పుట్టబోయిన లచ్చన్న (23) అనే వ్యక్తికి కాలు విరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్