అల్లూరి జిల్లాలో ఎలుగుబంటి దాడి: యువకుడికి తీవ్ర గాయాలు

633చూసినవారు
అల్లూరి జిల్లాలో ఎలుగుబంటి దాడి: యువకుడికి తీవ్ర గాయాలు
అల్లూరి జిల్లా అరకులోయ మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కీల్లో గోపాలరావు (28) అనే యువకుడిపై బుధవారం అడవిలో పశువులు కాస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో అతని ఎడమ చేతి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్