అరకులోయ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పుడువలస గ్రామానికి చెందిన ఒక యువకుడు గాయపడ్డాడు. ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై అరకులోయ వైపు వస్తుండగా, విశాఖపట్నం నుంచి వస్తున్న పర్యాటకుల కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం చొంపి వెళ్లే జాతీయ రహదారిపై వంతెన సమీపంలో జరిగింది. గాయపడిన యువకుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.