బొర్రా పంచాయతీ పరిధి నిన్నిమామిడి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు శుక్రవారం అధికారులను కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి రోడ్డు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.