మొంథా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయానికి వరద నీరు భారీగా చేరింది. దీంతో జలాశయం నిండుకుండలా మారి, పొర్లింది. జలాశయం నుంచి దిగువకు ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో బలభద్రం వాగు, పెద్దగెడ్డ కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.