నూతన సంవత్సరానికి సీఎం చంద్రబాబు వినూత్నంగా స్వాగతం పలికారు. అరకు వ్యాలీని కవర్ చేసిన అద్భుత సూర్యోదయ దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “సన్‌రైజ్ స్టేట్ నుంచి ఫస్ట్ సన్‌రైజ్” అంటూ ట్వీట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026లో హెల్తీ, వెల్తీ, హ్యాపీ AP లక్ష్య సాధనలో మరిన్ని ముందడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.