అల్లూరి జిల్లా అనంతగిరి మండలం అనంతరి పంచాయతీ బారిజల గ్రామంలో ముంతు తుఫాను కారణంగా పదుల ఎకరాలలో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుర్రమోహన్ అనే రైతు తన నష్టపోయిన తోటను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకుని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. తుఫాను వల్ల భారీ నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.