అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, జీనబాడు గ్రామ సమీపంలో ప్రమాదాలకు నిలయంగా మారిన మలుపు వద్ద రక్షణ గోడ లేకపోవడం, రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దేవరపల్లి నుంచి పినకోటకు వెళ్లే రహదారిలో ఈ సమస్య నెలకొంది. అధికారులు స్పందించి వెంటనే రక్షణ గోడను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.