శిధిలావస్థకు చేరిన పాఠశాల

0చూసినవారు
హుకుంపేట మండలం ఉప్ప గ్రామంలోని సుమారు 30 ఏళ్ల నాటి రేకుల భవనం కలిగిన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. గోడలు బలహీనపడి, పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు చదువుతున్న ఈ చిన్న భవనంలో తరగతులు, ఆట సామాన్లు ఒకేచోట ఉండటంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు అధికారులు వెంటనే స్పందించి కొత్త భవనం మంజూరు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్