చీడిమెట్టులో తాగునీటి కష్టాలు

82చూసినవారు
చీడిమెట్టులో తాగునీటి కష్టాలు
అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధి చీడిమెట్టు గ్రామస్థులు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. గ్రామంలోని ఊట గెడ్డ ఎండిపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన గెడ్డ నీటిపై ఆధారపడటం వల్ల అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నామని గిరిజనులు వాపోయారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.